telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పాలనలో అభివృద్ధి ఉన్నత శిఖరాలకు: రాష్ట్రపతి కోవింద్

Ram Nath Kovind

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జగన్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి తన అధికారిక ట్విట్టర్ ద్వారా జగన్‌‌ను అభినందించారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు జగన్ చేరుస్తారని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇప్పటికే జగన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జగన్ కు అభినందనలు తెలియజేశారు.

Related posts