telugu navyamedia
సినిమా వార్తలు

“మోడీ సర్కార్”, “సీఎం అఫ్ ఆంధ్రా”లను మించి ట్రెండ్ అవుతున్న “నేసమని”…!?

NEsamani

‘modi sarkar’, ‘cm of andhra’ దాటి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి ‘#pray for nesamani’ దూసుకుపోతోంది. ఇంతకీ ఈ నేసమణి ఎవరు? ఎందుకు ఆయన పేరు ఇంతగా ట్రెండ్అవుతోంది అంటే… పాకిస్థాన్‌కు చెందిన కొందరు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సుత్తి ఫోటోను సోషల్ మీడియాలో చూస్తిస్తూ, “ఈ పరికరాన్ని మీ దేశంలో ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి కొందరు వడివేలు అభిమానులు “ఫ్రెండ్స్” చిత్రంలో ఓ సన్నివేశంలో వడివేలు తలపై సుత్తి పడటంతో అతను కళ్లు తిరిగి పడిపోయే ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన ఒక కార్టూన్ ఫోటోను పోస్ట్ చేశారు.

2001లో తమిళ్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున హీరోగా “స్నేహమంటే ఇదేరా” పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రను తమిళ్‌లో వడివేలు నటించారు. ఆ చిత్రంలో వడివేలు పాత్ర పేరే నేసమణి. వడివేలు అభిమానులు పోస్ట్ చేసిన సన్నివేశాన్ని చూసిన కొందరు నెటిజన్లు వడివేలు నిజంగానే సుత్తి తగిలి పడిపోయాడనుకుని #pray for nesamani హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వడివేలు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే సమంత, సిద్దార్థ్, క్రికెటర్ హర్బజన్ సింగ్ స్పందించారు. దీంతో ఈ నేసమణి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

గాయపడ్డ నేసమణికి తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇచ్చింది. త్వరగా సృహలోకి వచ్చేయండి వడివేలు సర్ అని సిద్దార్థ్ చమత్కరిస్తూ ట్వీట్ చేశాడు. ఓబేబి చిత్రంలో సమంత ఏడుస్తున్న ఫోటోని ఆమె అభిమానులు షేర్ చేశారు. దీనిని నేస,మణి హ్యాష్ ట్యాగ్ తో సమంత రీట్వీట్ చేసింది. వడివేలు కార్టూన్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Related posts