telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో మరో విషాదం..

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి. దొరస్వామి ఇవాళ ఉదయం మృతి చెందారు. తీవ్ర ఆనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వి.దొరస్వామి రాజు చిత్తూరు జిల్లాకు చెందిన వారు. అంతకు ముందు యన్టీఆర్ సినిమాలను థర్డ్ పార్టీగా కొనుగోలు చేసి తిరుపతి పట్టణంలో ప్రదర్శిస్తూ ఉండేవారు.  1978లో రాయలసీమలో తిరుపతి పట్టణంలో ‘విజయమల్లేశ్వరి కంబైన్స్’ అంటే వి.ఎమ్.సి. పేరు మీద డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ప్రారంభించారు. ఈ సంస్థ చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమై తొలుత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘సింహబలుడు’ చిత్రాన్ని విడుదల చేసింది.
1979లో యన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘డ్రైవర్ రాముడు’ తో తమ వి.ఎమ్.సి. సంస్థ ను గుంతకల్ కేంద్రంగా రాయలసీమ అంతటా విస్తరించారు. ఆ తరువాత “వేటగాడు, యుగంధర్, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి” వంటి విజయవంతమైన చిత్రాలను తమ వి.ఎమ్.సి. ద్వారా రాయలసీమలో విడుదల చేసి మంచి పేరు గడించింది. అప్పటి నుంచీ దొరస్వామి రాజును అందరూ వి.ఎమ్.సి. దొరస్వామి రాజు అని పిలిచేవారు.  వి.ఎమ్.సి. తో పాటు విజయలక్ష్మీ పిక్చర్స్ వి.ఎల్.పి. సంస్థను కూడా దొరస్వామి రాజు స్థాపించి పలు చిత్రాలను విడుదల చేశారు. 

Related posts