telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లవర్‌ కోసం శ్రుతి హాసన్‌ ఆ పనే చేసేసింది…!

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో తాజాగా ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన క్రాక్‌ చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి నటించింది. ఈ సినిమా బంపర్‌ హిట్‌ కావడంతో సలార్‌ లో కూడా ఛాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం అమ్మడి కిట్టీలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే అమ్మడు మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. అతడెవరో కాదు శ్రుతి చిరకాల మిత్రుడు శంతను హాజిరికా. ఇతగాడు ఓ గొప్ప ఆర్టిస్టు. ఆర్ట్ బ్యాక్ డ్రాప్ వృత్తిగా స్వీకరించాడు. అతని తన లవర్‌ కోసం శృతి హాసన్‌ ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. అదేంటే.. పైనాపిల్‌తో ప్రత్యేక వంటకం రెడీ చేసింది శృతిహాసన్‌. అయితే కాస్త ఏమరుపాటు వలన అది మొత్తం మాడిపోయింది. దీనిని చూసిన శంతను.. “ఇది వెస్టెడ్‌ పైనాపిలా లేక రోస్టెడ్‌ పైనాపిలా ” అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts