telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అప్పుడే పుట్టిన బిడ్డను తల్లే చంపేసి…!?

Baby

కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్ ప్రాంతానికి చెందిన జాషువా బెన్సన్ (18), షానా ఆండ్రిట్చ్ (23) ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఏడాది క్రితం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెన్సన్ జంట వారికి పుట్టిన కూతురును హతమార్చి ఓ టీషర్ట్‌లో చుట్టి కార్డ్‌బోర్డ్ బాక్స్‌‌లో దాచారు. అనంతరం ఆ బాక్స్‌లో బిడ్డ మృతదేహంతో పాటు దుప్పటిని, బొమ్మలను పెట్టి దూరప్రాంతానికి తీసుకెళ్లి ఓ డ్రైనేజ్‌లో పడేశారు. కొరొనా ప్రాంతంలో ఆ బాక్స్‌ను ఓ స్థానికుడు గమనించి తెరవగా.. విషయం బయటపడింది. పోలీసులు ఇంతకాలం విచారణ జరుపగా.. నిందితులు బిడ్డ తల్లిదండ్రులేనని అధికారులు తెలుసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము చేసిన నేరాన్ని ఈ జంట అంగీకరించడంతో కోర్టు వారికి జీవితఖైదును విధించింది.

Related posts