హోటల్ బిల్లు చెల్లించలేదని యజమాని కస్టమర్ ను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదోమీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సూరజ్, విశాల్ అనే ఇద్దరు యువకులు ఓ దాబా హోటల్ కు వచ్చారు. భోజనం తిన్నాక యజమాని రూ.180 బిల్ వేశాడు. అయితే తాము తిన్నదానికి ఇది చాలా ఎక్కువని ఇద్దరు యువకులు వాదనకు దిగారు.
ఈ వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో సహనం కోల్పోయిన యజమాని గుర్మయిల్, అతని కుమారులు సరేంద్ర తమ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి దిగారు. రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడి నుంచి విశాల్ తప్పించుకోగా, సూరజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుర్మయిల్ తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయం: గల్లా జయదేవ్