telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో సామాజిక న్యాయం లేదు…

పంచాయతీ ఎన్నికల్లో లోపభూయిష్టంగా బీసీ రిజర్వేషన్ లతో వారిని అనగదొక్కారని ఏఐసీసీ అధికార ప్రతినిధి
దాసోజు శ్రావణ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ వెనకుండి..గోపాల్ రెడ్డి తో హైకోర్టులో కేసు వేసి రిజర్వేషన్లు కుదించారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే కుట్ర చేస్తున్నారని.. తెలంగాణ లో సామాజిక న్యాయం ఉండటం లేదని ఆగ్రహించారు. కులగణన చేయకుండా ఇష్టమొచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయిస్తున్నారని.. బీసీ నోళ్లలో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే.. కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతోందని చెప్పారు. ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. కర్ణాటక లో మాదిరిగా కేటగిరైజేషన్ ప్రకారం రిజర్వేషన్ లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ లపై సీఎం కేసీఆర్, ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కెసిఆర్ మోసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు టీఆర్ఎస్ నమ్మొద్దని తెలిపారు. 

Related posts