telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరిపాలన దెబ్బతింటుంది.. ప్రతి వారం కోర్టుకు రాలేను: జగన్

cm jagan on govt school standardization

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోర్టుకు హాజరు కాలేదు. తాజాగా, సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఎన్నో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, పరిపాలనకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రతి వారం కోర్టుకు హాజరుకావడం వల్ల పరిపాలన దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బోగోలేదని పేర్కొన్నారు. తాను కోర్టుకు హాజరుకావాలంటే ప్రొటోకాల్ తో పాటు భద్రతకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. తన తరపున న్యాయవాది అశోక్ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని విన్నవించారు. వ్యక్తిగతంగా తాను హాజరుకావాలని కోర్టు భావించినప్పుడు తప్పకుండా కోర్టుకు వస్తానని పిటిషన్ లో పేర్కొన్నారు.

Related posts