telugu navyamedia
రాజకీయ వార్తలు

పాక్ దగ్గర ట్రైన్ అయినట్టుగానే .. చైనా మాటలు.. డోక్లాం పై చర్చలట..

boycott china with hash tag viral

చైనా-భారత్‌తో గతంలో ఏర్పడిన డోక్లాం వివాద పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడే విధంగా తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ‘చైనాస్‌ నేషనల్‌ డిఫెన్స్‌ ఇన్‌ ది న్యూ ఏరా’ పేరుతో చైనా రక్షణమంత్రిత్వశాఖ బుధవారం ఇక్కడ ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ పత్రంలో భారత్‌తోపాటు అమెరికా, రష్యా తదితర దేశాలతో తన సైనిక బలాన్ని పోల్చటంతో పాటు వివిధ అంశాలను ప్రస్తావించింది. భారత్‌-చైనా సరిహద్దుల వెంట శాంతి, భద్రతలను కాపాడేందుకు వీలుగా తాము 2017 నాటి డోక్లాం వివాద పరిష్కారానికి సానుకూల పరిస్థితులను ఏర్పాటు చేశామని చైనా ఈ శ్వేతపత్రంలో వివరించింది.

భారత్‌, అమెరికా, రష్యా తదితర దేశాల సైన్యాలతో పోటీగా తమ సైన్యాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన చర్యలను చైనా రక్షణ మంత్రిత్వశాఖ ఈ శ్వేతపత్రంలో వివరించింది. తమ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతోందన్న విమర్శలను ఈ శ్వేతపత్రం తోసిపుచ్చింది. భారత్‌, అమెరికా తదితర దేశాలతోపోల్చుకుంటే చైనా తన జిడిపిలో అత్యంత తక్కువ స్థాయిలోనే రక్షణ వ్యయాన్ని కొనసాగిస్తోందని వివరించింది. తాము కొనసాగిస్తున్న రక్షణ వ్యయం సహేతుకమైనది, తగిన స్థాయిలోనే వుందన్న ఈ శ్వేతపత్రం తమ దేశం అభివృద్ధిని, భద్రతను సమతుల్యతతో కొనసాగిస్తోందని స్పష్టం చేసింది.

Related posts