telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గుంతల రోడ్డుపై వరినాట్లు వేసిన డీకే అరుణ

dk-aruna

గద్వాల్ లో గుంతలు పడి వర్షపు నీటితో నిండిన రోడ్లపై మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ రినాట్లు వేసి తమ నిరసన తెలిపారు. గద్వాల్ లోని రోడ్ల దుస్థితిపై అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెండవ రైల్వేగేటు సమీపంలోని రోడ్డు గత వర్షాలకు పాడైపోయింది. మరమ్మత్తు చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.

రహదారులు వరిమళ్లు అయిపోయాయని ఇలాంటి రోడ్లపై పాదాచారులు, వాహనచోదకులు ఇబ్బందులుపడుతునారన్నారు. గత ఐదేళ్లుగా ఆర్వోబి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts