telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పసి హృదయాలకు జాతి వివక్ష, రంగు తెలియదుగా… ఈ పిల్లలు ఏం చేశారో చూడండి

toddler

సోషల్ మీడియాలో ఇద్దరు చిన్న పిల్లలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉన్న ఇద్దరు పసిపిల్లల వయసు కేవలం రెండేళ్లు మాత్రమే. ఒకరి పేరు మ్యాక్స్‌వెల్.. ఇంకొకరి పేరు ఫిన్నెగన్. వీరిద్దరూ దాదాపు ఏడాది క్రితం స్నేహితులుగా మారారు. ఇద్దరూ కలిసి ఒకే చోట డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఒకరి గురించి మరొకరు తల్లిదండ్రులను అడుగుతూనే ఉంటారట. గత ఆదివారం న్యూయార్క్ వీధుల్లో మ్యాక్స్‌వెల్, ఫిన్నెగన్ తండ్రులు ఎదురు పడగా.. వెంటనే పిల్లలిద్దరూ ఒకరిని ఒకరు చూసి తెగ సంతోషపడ్డారు. చేతులు చాచి మరీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఇద్దరూ హత్తుకున్నారు. ఈ వీడియోను మ్యాక్స్‌వెల్ తండ్రి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. వీడియోను చూసిన ప్రతిఒక్కరు వారిద్దరినీ చూసి ఎంతో నేర్చుకోవాలని అంటున్నారు. జాతి వివక్ష, రంగు ఇలాంటివి పసిపిల్లలకు తెలియదని, వారికి కావాల్సింది కేవలం ఆనందం మాత్రమేనని కొందరు కామెంట్ చేయగా, వారిద్దరూ జీవితాంతం ఇలానే కలిసుండాలని మరికొంతమంది కామెంట్ చేశారు.

Related posts