telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లు.. జగన్‌పై లోకేష్ విమర్శలు

Minister Lokesh comments YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్ గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించ‌లేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారని’ దుయ్యబట్టారు.

టీడీపీ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమమని మీరంటే అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడని వ్యాఖ్యానించారు. దేవుడి స్కిప్ట్‌లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయన్నారు. భ్ర‌మ‌రావ‌తి అన్న మీ భ్ర‌మ‌లు తొల‌గించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడంటూ ఎద్దేవాచేశారు.

Related posts