telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

ఫిబ్రవరి 03 బుధవారం దినఫలాలు

మేషం : నిర్మాణ పనులలో పురోభివృద్ధి. సకాలంలో పూర్తి అయ్యే సూచనలు కానవస్తాయి. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి ఆశాజనకం. సన్నిహితుల ద్వారా అనుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రైవేటు, పత్రికా రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తప్పవు.

 

వృషభం : కంది, ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, ఆవాలు స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. ఇతరుల వాహనం నడపడం వల్ల అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అపరిచితులను అతిగా విశ్వసించడం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు.

 

మిథునం : ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. గృహంలో మార్పులు చేర్పులకై చేయు యత్నాలు వాయిదాపడగలవు.

 

కర్కాటకం : ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. బంధువులు, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

 

సింహం : ఆర్థిక స్థితి ఒకింత మెరుగుపడటంతో ఊరట చెందుతారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. నూతన పరిచయాలేర్పడతాయి. బంధుమిత్రుల నుంచి మొహమ్మాటాలు ఎదురవుతాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు.

 

కన్య : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.

 

తుల : దంపతుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు.

 

వృశ్చికం : స్త్రీలకు ముఖ్యమైన విషయాల్లో గోప్యం అవసరం అని గమనించండి. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.

 

ధనస్సు : సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. రావలిసన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. నిర్మాణ పనులో చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.

 

మకరం : ఆర్థిక ఆరోగ్య విషయాలలో సంతృప్తికానవస్తుంది. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్వయంకృషితో మీ పనులు సానుకూలమవుతాయన్న వాస్తవాన్ని గ్రహించండి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు.

 

కుంభం : లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, అదుపు చాలా అవసరం.

 

మీనం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. చేపట్టన పనులలో అవాంతరాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి.

Related posts