telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ

cm jagan on govt school standardization

జగన్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులతో ఏపీ సీఎం జగన్ అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో త్వరలోనే రాష్ట్రానికి రూ.6,000 కోట్ల రుణం మంజూరు చేసే అంశంపై చర్చించారు. ఈ రుణాన్ని 32 సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు ప్రతినిధులు చెప్పారు. ఏపీలో రోడ్లను మెరుగుపర్చడంతో పాటు, పలు ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.

ఈ భేటీలో అదనంగా మరికొన్ని నిధులు కూడా రుణంగా ఇవ్వాలని బ్యాంకు ప్రతినిధులను జగన్ కోరారు. రాష్ట్రంలో రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్ల నిర్మాణం, ఆధునికీకరణ కోసం రూ.25,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ఉపాధ్యక్షుడు జాంగ్, ప్రాజెక్ట్ హెడ్ రాజ్ పుర్కార్ పాల్గొన్నారు.

Related posts