telugu navyamedia
క్రీడలు వార్తలు

బుమ్రాకు ఆ సత్తా ఉంది అంటున్న ఆంబ్రోస్…

వెస్టిండీస్ మాజీ పేసర్ కర్ట్‌ లీ ఆంబ్రోస్ జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. భారత్​లో ఉత్తమమైన ఫాస్ట్​ బౌలర్లు కొంతమంది ఉన్నారు. నేను చూసిన బౌలర్లలో అతడు ఎంతో ప్రత్యేకం, ప్రతిభావంతుడు. భవిష్యత్​లో మరింత బాగా, ఎక్కువ కాలం రాణిస్తాడని ఆశిస్తున్నాను. సీమ్​, స్వింగ్​, యార్కర్లు.. ఇలా అన్ని విధాలుగా బౌలింగ్​ చేయగలడు. కాబట్టి ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండి ఆడగలిగితే కచ్చితంగా 400 వికెట్లను అందుకోవడం ఖాయం” అని ఆంబ్రోస్ అన్నాడు. అతని షార్ట్ రనప్‌తో వచ్చిన సమస్యేం లేదన్నాడు. ‘ఫాస్ట్ బౌలింగ్.. బౌలర్ రిథమ్‌పై ఆధారపడి ఉంటుంది. బంతి వేసే ముందు మంచి రిథమ్ ఉండటం ముఖ్యం. బుమ్రాకు షార్ట్ రనప్ ఉంది. ఒకటి రెండు జాగ్స్ మినహా అతని రనప్ నడకలానే ఉంటుంది. దీన్ని బట్టి అతను శరీరంపై ఒత్తిడి పెడ్తాడనే విషయం అర్థం అవుతుంది. అయితే అతను బలంగా ఉంటే వచ్చే సమస్యే ఏం లేదు. అతను ఫిట్‌గా ఉండి తన బౌలింగ్‌ను కొనసాగిస్తే తిరుగుండదు’అని ఆంబ్రోస్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు బుమ్రా 19 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు.

Related posts