telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎన్టీఆర్ 30 సినిమాలో ఆ లేడీ విలన్…?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. అయితే ఓ వైపు ఎన్టీఆర్ తన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు కాబట్టి.. త్రివిక్రమ్‌తో చేయబోయే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం… ఈ ఏడాది క్రాక్ సినిమాతో అందరినీ మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారంట. దర్శకుడు త్రివిక్రమ్ కూడా వరలక్ష్మిని సినిమాలోకి స్వాగతించేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ రెడీ చేసిన కథ పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందని అంటున్నారు. అందుకే తెలుగు తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఇంకా హిందీలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే అన్ని భాషలకు కూడా ఒకే టైటిల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related posts