telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పుష్పక విమానం’లో దేవరకొండ..

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ అని అందరికి తెలిసిందే. దొరసాని సినిమాతో ఆనంద్‌ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హీరో, హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అయితే మరో సినిమా పేరునూ తాజా ప్రకటించారు ఆనంద్. ఫార్ట్ ఫిలిమ్ మేకర్ దామోదర అట్టాడ దర్శకత్వంలో విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి గోవర్థన్ రావ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ అనే పేరు ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ లోగో పోస్టర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. మరో విశేషం ఏమంటే.. ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీకి అతను సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో అమిత్ దాసాని,సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్నారు. గతంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సైలెంట్ మూవీ ‘పుష్పక విమానం’ వినోదాల జల్లు కురిపించి, భారతీయ సినిమా రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మరి ఈ ‘పుష్పక విమానం’ ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.

Related posts