ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ అయితే.. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి దించుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్‌ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి జీతం అవససరమా అని నిలదీశారు. పార్లమెంట్ కి పోకుండానే హాజరు అయినట్టు దొంగ సంతకాలు పెట్టించాడని..సభను తప్పు దోవ పట్టించాడు.. సీఎం కేసీఆర్‌కు నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్పీకర్ కు పిర్యాదు చేస్తానని… అయ్యా, కొడుకులు కలిసి అబద్ధాల యూనివర్సిటీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తల కింద పెట్టి, కాళ్ళు పైన పెట్టినా టీఆర్‌ఎస్ గెలిచే ప్రసక్తే లేదన్నారు. టీఆర్‌ఎస్ కాదు… తెలంగాణ రిజెక్టెడ్ సమితి అని.. వెంటిలేటర్ పై ఉందని పేర్కొన్నారు. పెన్షన్లు, జీతాలు ఇవ్వలేక పోతున్న కేసీఆర్…. 29 శాతం పీఆర్సీ ఇస్తాడా… ఉద్యోగ సంఘాల నేతలారా ఆశించడం కాదు శాసించాలని కోరారు.
previous post