telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సూర్యగ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించిన ప్రజలు

solareclipse India

ఈ రోజు ఉదయం 8:08 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం 11:11 గంటలకు ముగిసింది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఢిల్లీలోని తన నివాసంలో గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించినప్పటికీ.. మబ్బుల వల్ల సూరగ్రహణాన్ని చూడలేకపోయారు. కానీ కేరళలోని కోజికోడ్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రహణం దృశ్యాలను చూసినట్లు మోదీ తెలిపారు.

సూర్యగ్రహణం ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులు ఆలయాల శుద్ధి చేపట్టారు. అనంతరం దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. ఇక ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, ఒమన్‌, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్‌ లో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది.

Related posts