గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్ పాటిస్తూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఓవైపు గ్రేటర్ హైదరాబాదీ ఓటు వేసేందుకు అంతగా ఆసక్తిచూపడం లేదు.. దీంతో.. ఓటింగ్ శాతం మందకొడిగా నమోదవుతోంది.. మరోవైపు ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో ఏకంగా ఎన్నికల గుర్తునే మార్చేశారు అధికారులు… ఓల్డ్ మలక్‌పేట్ 26వ వార్డులో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తుండగా.. సీపీఎం గుర్తును ముద్రించారు.. సీపీఐ ఎన్నికల గుర్తుఅయినటువంటి కంకి కొడవలకి బదులుగా.. సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలని బ్యాలెట్‌లో ముద్రించారు అధికారులు.. దీంతో.. ఆ డివిజన్‌లో ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేసింది సీపీఐ హైదరాబాద్ సిటీ సమితి. ఈ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీచేస్తున్నాయి.. కానీ, ఇలా గుర్తునే అధికారులు మార్చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
previous post
next post