telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సలహా ఇవ్వమని అడిగితే .. మా వైపు వేలెత్తి చూపిస్తున్నారు: జగన్

cm jagan on govt school standardization

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలపై జరుగుతోన్న నేరాల గురించి సభలో ప్రస్తావించారు. మహిళలపై దాడుల నిరోధానికి సలహా ఇవ్వమని అడిగితే చంద్రబాబు నాయుడు మా వైపు వేలెత్తి చూపిస్తున్నారు తప్పా ఏమీ సలహా ఇవ్వట్లేదు. ఆరు నెలల్లో ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అంటున్నారు’ అని అన్నారు.

‘శాంతి, భద్రతలు లేకుండా పోయిందని అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలన కొనసాగింది. ఆయన కాలంలో మహిళలపై వేలాది నేర కేసులు నమోదయ్యాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, వరకట్నం కేసులు వంటివి ఎన్నోనమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో నేర రేటు అధికంగా ఉంది’ అని జగన్ వ్యాఖ్యానించారు.

‘చిన్నపిల్లలపై జరిగిన నేరాలపై కూడా వేలాది కేసులు నమోదయ్యాయి. ఇంక కొందరు ఉన్నారు అధ్యక్షా.. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంత మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో అధ్యక్షా.. ఒకరు సరిపోరు.. ఇద్దరు సరిపోరు.. ముగ్గురు సరిపోరు.. నలుగురు పెళ్లాలు కావాలని తాపత్రయపడుతున్నారని సభలో అన్నారు.

Related posts