telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబును, ఆయన భార్యను కన్నీళ్లు పెట్టించిన అభిమానులు

sobhan-babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. ఒకసారి శోభన్ బాబును, ఆయన భార్యను కన్నీళ్లు పెట్టించారు అభిమానులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Sobhan-Babu2

అప్పట్లో ఒకసారి శోభన్ బాబు బాబాయ్ గారు గుండె జబ్బుతో మరణించినట్టు వార్త వచ్చింది. వార్త తెలుసుకున్న శోభన్ బాబు వెంటనే బయల్దేరారు. పట్టపగలే కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి… జోరుగా వర్షం పడుతోంది… ఒకరకంగా కుంభవృష్టి అని చెప్పొచ్చు. అప్పటికే గాలివాన అని పత్రికలు, రేడియోలు ప్రకటించినా కూడా అవసరం కాబట్టి వెళ్లక తప్పలేదు శోభన్ బాబుకు. ఉన్నట్టుండి కారు ఆగింది. డ్రైవర్ బిక్కమొహం వేశాడు. వెళ్లాల్సిన ఊరు ఇంకా పది మైళ్ళు ఉంది. కారు దిగి చూస్తే ఓ వెడల్పాటి వాగు వెల్లువలా ప్రవహిస్తోంది. అక్కడే మేకలు మేపుకుంటున్న ఓ వ్యక్తిని ఉపాయం అడగ్గా… మూడ్రోజులదాకా ఈ ప్రవాహం తగ్గదు వెనక్కి వెళ్లిపొమ్మన్నాడు. భర్తను పోగొట్టుకుని జీవచ్ఛవమై మిగిలిన మా పిన్నిని ఇక్కడి వరకూ వచ్చి, పది మైళ్ళ దగ్గరదాకా వచ్చి ఎలా తిరిగి వెళ్ళేది ? బాధతో, నిస్సహాయతతో శోభన్ బాబు గుండె బరువెక్కింది.

Cyclone

ఎలాగయినా పిన్నిగారిని పరామర్శించే వెళ్ళాలి అని నిర్ణయించుకుని, మరేదైనా దారి ఉంటే చెప్పమని ఆ గొల్ల అబ్బాయిని అడిగారు శోభన్ బాబు. ఆ కుంభవృష్టిలో తడిసి ముద్దైపోయిన శోభన్ బాబు వంక తీక్షణంగా చూసిన ఆ అబ్బాయి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని తన స్నేహితులను గట్టిగా పిలిచాడు. “బాబుగారూ మీరా…” అంటూనే వాగులోకి దూకేశాడు. చూస్తుండగానే ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు.

Vaagu

పది నిమిషాల్లో కొన్ని వందల గొడుగులతో పక్కనున్న పల్లె అంతా అక్కడికి కదిలి వచ్చింది. మరో 5 నిమిషాల్లో ఓ ఆసామి ట్రాక్టరు వచ్చి ఆగింది. ఇంతలో ఓ 10 మంది బలమైన వ్యక్తులు ఈవలి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. మీకేం భయం లేదు.. ధైర్యంగా ఉండండి అంటూ శోభన్ బాబును సగం మంది తలవైపు సగం మంది కాళ్ళవైపుకు పట్టుకుని ఈదుకుంటూ… అవలీలగా ఆయనను అవతలి ఒడ్డుకు చేర్చారు. మళ్ళీ వెనక్కి ఎప్పుడొస్తారని అడిగారు. మరో రెండు గంటల్లో వస్తానని చెప్పారు శోభన్ బాబు. వాళ్ళ దగ్గర అసెలవు తీసుకుని పిన్నిగారింటికి చేరుకున్నారు శోభన్ బాబు.

Black-Umbrella

పిన్నిగారికి ధైర్యం చెప్పి మరునాడే షూటింగ్ ఉండడంతో తిరిగి బయల్దేరారు ఆయన. ఆయనొచ్చే వరకూ అక్కడే కూర్చుని ఉన్నారు ఇంతకుముందు వచ్చిన ఊరు వాళ్ళు. వాళ్ళ అభిమానం చూసిన శోభన్ బాబు కంఠం మూగవోయింది. కృతజ్ఞతా భావంతో అందరికీ రెండు చేతులూ జోడించగా.. ఆయన కళ్ళవెంట ఆనంద భాష్పాలు జాలువారాయి. వెంటనే గ్రామస్తులు మేం చేసిందేముంది బాబుగారూ… ఈ విధంగానైనా మిమ్మల్ని చూడడం మా అదృష్టం. లేదంటే ఆ పట్నం వచ్చి మిమ్మల్ని చూడగలమా ? అంటూ ప్రతినమస్కారం చేశారు. మళ్ళీ వారంతా కలిసి శోభన్ బాబును ఇవతల ఒడ్డుకు చేర్చారు. శోభన్ బాబు వారిని ఆప్యాయంగా గుండెకు హత్తుకున్నారు. జన్మజన్మలకూ వారిని గుర్తుంచుకుంటానని చెప్పి తిరిగి ప్రయాణమయ్యారు శోభన్ బాబు.

Car-Accident

అప్పట్లోనే మరోసారి షూటింగ్ నుంచి వస్తుంటే శోభన్ బాబు కారుకు యాక్సిడెంట్ అయ్యిందని, ఆయన అక్కడికక్కడే మరణించారనే గాలివార్త పెను తుఫానులా వ్యాపించింది. 24 గంటల్లోనే ఆంధ్రరాష్టం నలుమూలల నుంచి టెలిఫోన్లు, టెలిగ్రాంలు శోభన్ బాబు ఇంటిని ముంచెత్తాయి. ఆ రాత్రంతా శోభన్ బాబుకు నిద్రలేదు. ఆ వార్త అబద్ధమని శోభన్ బాబు మేనేజర్ ఎంత చెప్పినా ఎవరూ వినేవారు కాదు. దాంతో శోభన్ బాబు స్వయంగా చెప్పేదాకా శాంతించేవారు కాదు ఫోన్లో.

Man-on-Phone

టైలర్ గా పనిచేసే శోభన్ బాబు అభిమాని ఫోన్ చేసి, తాను శోభన్ బాబు యాక్సిడెంట్ వార్తను విని ఉదయం నుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడట… వాళ్ళనూ వీళ్ళనూ విషయం అడిగినా ఎవరూ సరిగ్గా చెప్పట్లేదట. రేడియోలో, పేపర్లో చూసినట్లు కొందరు చెప్పారట. ఉదయం నుంచీ శోభన్ బాబుతో ఫోన్లో మాట్లాడేవారకూ కనీసం టీ కూడా తగలేదట ఆ వ్యక్తి. ఈ విషయమే చెబుతూ “మీరు చచ్చిపోతే నేనేం కావాలి బాబూ” అంటూ ఫోన్లోనే ఏడ్చేశాడా వ్యక్తి.

Sobhan Babu

మీ అభిమానం కోసమైనా బ్రతికే ఉంటానంటూ ఆయనను ఓదార్చి ఫోన్ పెట్టేశారు శోభన్ బాబు. ఇదంతా చూసిన శోభన్ బాబు భార్య “ఇంత అభిమానం సంపాదించుకున్న మీరు మాకోసం కాకపోయినా ఆ అభిమానుల కోసమైనా నూరేళ్లూ బ్రతకాలంటూ బావురుమన్నారు. ఆమెను ఓదార్చేసరికి తెల్లవారింది శోభన్ బాబుకు. ఈ అభిమాన సంపదకు ఏ సంపదా సరితూగదని, అభిమానుల అండదండలుంటే చాలని, తన జన్మ ధన్యమైందని భావిస్తున్న శోభన్ బాబుకు తెలియకుండానే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఇలా అభిమానులు శోభన్ బాబును, ఆయన భార్యను తమ అభిమానంతో ఏడిపించారన్నమాట.

ఇవి కూడా చదవండి

శోభన్ బాబును, ఆయన భార్యను కన్నీళ్లు పెట్టించిన అభిమానులు

శోభన్ బాబు సినిమాలు మానేశాక ఏం చేసేవారు ?

శోభన్ బాబు 40 సంవత్సరాల కాఫీ తాగే అలవాటును ఎందుకు మానుకున్నారంటే ?

శోభన్ బాబు సభలకు, సమావేశాలకు వెళ్లేవారు కాదు… ఎందుకంటే…?

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

జయలలితతో శోభన్ బాబు డిన్నర్…

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts