telugu navyamedia
సినిమా వార్తలు

తెర వెనుక పనులతో బిజీగా అనుష్క

Anushka-Sharma-and-Virat-Kohli

గత ఏడాది “జీరో” సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇంతవరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై అనుష్క శర్మ స్పందిస్తూ తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటికి సమయాన్ని కేటాయించడం కోసమే కొత్త సినిమాకు సైన్ చేయలేదని చెప్పింది. సినీ నటిగా 2018లో “పారి”, “సూయీ ధాగా”, “జీరో” సినిమాలు చేశానని, ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవని, అలాంటి చిత్రాలను చేయాలంటే ఎంతో ప్రిపరేషన్ అవసరమని, అందువల్ల వచ్చిన ఆఫర్లన్నింటినీ తీసుకోలేమని చెప్పుకొచ్చింది. ఒకవైపు నటిగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నానని, ప్రస్తుతం ఒక సినిమాతో పాటు, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కోసం షోలను నిర్మిస్తున్నానని అనుష్క తెలిపింది. వీటికి కూడా సమయాన్ని కేటాయించాల్సి ఉందని, తెర వెనుక తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది అనుష్క శర్మ. మరి ఇదంతా చూస్తుంటే మరో సినిమాకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలా సమయమే పట్టేలా కన్పిస్తోంది.

Related posts