telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రదీప్ తో డేటింగ్ స్పందించిన నటి… !

pradeep

దర్శకుడు శ్రీరామోజు సునిశిత్… యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు, హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఎఫైర్ ఉందని, గతేడాది ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ అనే ప్రోగ్రామ్‌ లో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి అనే నటితో డేటింగ్ చేసాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీని గురించి తాజాగా జ్ఞానేశ్వరి ఓ సందర్భంలో మాట్లాడుతూ “పెళ్లి చూపులు షోకు నేను అనుకోకుండా వచ్చేశాను. పబ్లిక్‌గా మేం ఏం చేసినా ఇక జనాల్లో గుసగుసలకు అడ్డు ఉండదు. అదీకాకుండా ప్రదీప్ సౌతిండియాలోనే మోస్ట్ పాపులర్. కాబట్టి ఇక ఆయన ఏం చేసినా వైరలే. అందుకే నేను, ఆయన డేటింగ్‌లో ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలకు తెలిసింది తెలీనిదీ అన్నీ కలిపి ఏవేవో కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి వార్తలు వస్తాయని నేను ముందు నుంచీ ప్రిపేర్ అయి ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అన్నీ 99 శాతం అబద్ధమే. ఆ కార్యక్రమంలో జరిగింది పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి చూపులకు, పెళ్లికి చాలా తేడా ఉంది. ఆ రెండిటికి మధ్య ఇంకా చాలా జర్నీ ఉంటుంది. కాబట్టి నా గురించి ప్రదీప్ గురించి ఎవరు ఏమని అడిగినా కూడా వెయిట్ అండ్ సీ అని చెప్తుంటాను” అని వెల్లడించారు.

Related posts