telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలివిగలవారు ఉపాధ్యాయులు కారని ఎవరో చెప్పారు : ఆర్జీవీ

RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వర్మ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ వివాదాస్పద ట్వీట్ ఏంటంటే “తెలివిగలవారు ఉపాధ్యాయులు కారని నాకు ఎవరో చెప్పారు. టీచర్లు తెలివైనవారే అయితే ఏమీ తెలియని వారితో నిండిన క్లాస్ రూముల్లో కూర్చుని పాఠాలు చెప్పడానికి తమ సమయాన్ని వృథా చేసుకోరు. నేనైతే ఎవరి వద్ద నేర్చుకోను. ఎవరికీ బోధించను. ఇదే నేను నేర్చుకున్న పాఠం” అంటూ ‘అన్ హ్యాపీ టీచర్స్ డే’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు. అంతేకాదు చెడు అధ్యాపకుడు ఉండటం వల్లే చెడు విద్యార్థి తయారవుతాడా? అని వర్మ ప్రశ్నించారు. డబ్బు సంపాదనలో సక్సెస్ ఫుల్ అయిన ఎందరో విద్యార్థులు తనకు తెలుసని, కానీ తన జీవితంలో ఒక మంచి టీచర్ ను కూడా కలవలేకపోయానని చెప్పారు. తానొక చెడు విద్యార్థినని, అందుకే తన టీచర్లను ఎవరినీ అభిమానించలేకపోయానని అన్నారు. తన పట్ల తన టీచర్లు ఎవరూ సంతోషంగా లేరని, తాను కూడా వారి పట్ల సంతోషంగాలేనంటూ చెప్పుకొచ్చాడు వర్మ. ఈ ట్వీట్లపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related posts