telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమన్నాపై కామెంట్‌ చేసిన హీరో సత్యదేవ్

కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టేల్’ తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతోంది. సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మేఘా ఆకాశ్, కావ్యశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు నాగశేఖర్ మిత్రులతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తనది హీరో పాత్రే అయినా… రియల్ హీరో మాత్రం తమన్నానే అంటున్నాడు సత్యదేవ్. ఆమె ఈ మూవీలో నటించడానికి అంగీకరించిన దగ్గర నుండి గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయిందని చెబుతున్నాడు. లాక్ డౌన్ కాలంలో ఎన్నో సినిమాలు తాను చూశానని, కథలు విన్నానని, అయితే… ఈ మూవీ ఆఫర్ రాగానే వెంటనే అంగీకరించాలని పించిందని తమన్నా తెలిపింది. ఈ చిత్రానికి మాటలు రాసే పనిని వేసవి కాలంలో మొదలు పెట్టానని లక్ష్మీ భూపాల్ చెప్పగా, తాను మాత్రం వర్షాకాలంలో ట్యూన్స్ పని మొదలు పెట్టానని సంగీత దర్శకుడు కాలభైరవ చెప్పాడు.

Related posts