telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ సర్కార్‌పై గళమెత్తిన వారిపై సీబీఐ దాడులు: మమత

BJP compliant EC West Bengal

ప్రధాని నరేంద్ర మోదీ పై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. మంగళవారం ఓ వార్తాచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై గళమెత్తిన వారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మోదీ భయభ్రాంతులకు గురిచేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను సీబీఐ దాడులకు భయపడనని, బీజేపీని అధికారం నుంచి సాగనంపి దేశాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే కొలువుతీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రపక్షాల తో కలిసి బీజేపీకి 150 స్ధానాలు వస్తాయని, బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా విస్పష్ట మెజారిటీ రాదని స్పష్టం చేశారు. ప్రధాని రేసులో ఎవరుంటారనేది ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలు నిర్ణయిస్తాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో 125-150 స్ధానాలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు జతకడితే బీజేపీ కంటే ఎక్కువ స్ధానాలు కూటమి వైపు ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Related posts