telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్ సినిమా ఆగిపోయింది… కారణం ఇదేనా ?

Salman-KHan

20 ఏళ్ళ త‌ర్వాత సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ కాంబినేష‌న్‌లో “ఇన్షా అల్లా” అనే ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఈద్‌కి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నామని దర్శకనిర్మాతలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి తాత్కాలిక బ్రేక్ ప‌డిందని భ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్ర‌క‌టించింది. స‌ల్మాన్ కూడా సినిమా ఆగిపోయింద‌ని చెబుతూ 2020 ఈద్‌కి మిమ్మ‌ల్ని త‌ప్ప‌క క‌లుస్తాన‌ని ట్వీట్‌లో పేర్కొన్నాడు. చిత్రంలో అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, తొలిసారి స‌ల్మాన్‌తో జ‌త‌కట్టింది. అలియా కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే “ఇన్షా అల్లా”కి కాస్త బ్రేక్ ప‌డిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాగా 1999 లో వ‌చ్చిన “హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్” అనే చిత్రం కోసం స‌ల్మాన్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ క‌లిసి ప‌ని చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు వీరిద్దరూ కలిసి పని చేస్తుండడం విశేషం. స‌ల్మాన్ ద‌బాంగ్-3, కిక్-2 చిత్రాలతోను బిజీగా ఉన్న సంగ‌తి ఉండగా… అలియా ప్ర‌స్తుతం “బ్ర‌హ్మాస్త్రా” చిత్రంతో తెలుగులో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తోంది.

Related posts