telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సల్మాన్ పై ట్రోలింగ్… పబ్లిసిటీ కోసమే రైతు అవతారం…!!

Salman-KHan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా రైతు అవతారమెత్తి తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా సల్మాన్ పన్వెల్‌లోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడి తన వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండిస్తున్నాడు. ఆ మధ్య నాట్లు వేస్తూ, మొన్న వంటినిండా బురద తో, నిన్న ట్రాక్టర్ ఎక్కి దున్నుతూ, ఇలా రోజుకొక ఫోటోను, వీడియోను అప్లోడ్ చేస్తున్నాడు. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ ఈ మధ్య ఏం చేసిన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సల్మాన్ మాత్రం పబ్లిసిటీ కోసం రోజుకొక ఫోటో వీడియో పోస్ట్ చేస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ పెద్దలను నెటిజన్లు టార్గెట్ చేశారు. వారిలో సల్మాన్ కూడా ఒకరు.

Related posts