telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ర్యాప్ సాంగ్… మెగాస్టార్ బర్త్ డే స్పెషల్

Megastar

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. దీంతో ఆగస్టు మొత్తం చిరు పుట్టిన రోజు సందడి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఆయన అభిమానులు. దీనికోసం కామన్ డీపీలు, యాష్ ట్యాగులు మెగాస్టార్ ఫొటోలతో రచ్చ చెయ్యాలని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటి నుంచే చిరు అభిమానులు సోషల్ మీడియాలో వేడుకలకు తెరలేపేశారు. ఇక అక్కడ మెగాస్టార్ పుట్టినరోజు రికార్డుల దుమ్ము దులపాలని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అందుకోసం కొంతమంది అభిమానులు చిరంజీవికి ప్రత్యేక ర్యాంప్ పాటను కానుకగా ఇవ్వాలని సిద్ధం అవుతున్నారు. ‘ఎవ్రీబడీ ట్యూన్ ఇన్ టూ ది బీట్..’ అంటూ సాగిన ఈ ర్యాప్ గ్లిమ్స్ లో మెగా ఫ్యాన్స్ ‘జై చిరంజీవ’ ప్లాగ్స్ తో చిరు ఫేస్ మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఈ మెగా ర్యాప్ పూర్తి సాంగ్ ని చిరంజీవి బర్త్ డే ముందురోజు అంటే ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Related posts