telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పట్టింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా.. గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. దీని ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏకకాలంలో 5000 కెమెరాలను వీక్షించే సదుపాయం కలుగనుంది. ట్రై కమీషనర్ రేట్ పరిధిలో సేఫ్ సీటీ ప్రాజెక్టు కింద ఏర్పాటవుతున్న సిసి కెమెరాల దృశ్యాల్ని ఇక్కడ నుంచి వీక్షించే సదుపాయం ఉండనుంది. డేటా సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హమ్మ‌ద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

Related posts