telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఓ వలస కార్మికుడా… దిన దిన గండమైనదా నీ బ్రతుకు

labour lockdwon

కార్మికూడా ఓ వలస కార్మికుడా

దిన దిన గండమైనదా నీ బ్రతుకు

పొట్ట చేతపట్టి ఏ ఊరు అంటే ఆ ఊరికి

వలస వెళ్తుంటావు

అక్కడ పరిస్థితి బాగోపోతే 

తిరుగుపయనం కట్టేస్తావు

ఇప్పుడు అనుకోని ఈ కరోనా 

విపర్తు వచ్చి నిన్ను కలవరపెట్టిందా

 

దాహం తీర్చే నాధుడే లేడా

నీకు దారి చూపే నేస్తమే లేడా

కానరాని పయనం నీ కాలికి ముళ్లుగా మారిందా

తీరం తోచక గమ్యం ఏమిటో తోచకుంటుందా

 

నీవు నడిచి వచ్చే దారిలో కలిసే ఆ పారిశుధ్య కార్మికులే నీకు ఆత్మ బంధువులు

నీవు అలసి సేదతీరే తరుణంలో ఆ పోలీస్

అన్నలే నీ రక్షక భటులు

 

ఓ వలస కార్మికుడా వచ్చునులే మంచి రోజులు

కలవర పడకు కన్నీరు అస్సలు పెట్టకు

ధైర్యాన్ని వీడకు ఓర్పుని ఆయువుగా చేసుకుని

సాగిపో నీ గమ్యాన్ని చేరుకో

 

Related posts