telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

వీడియో కెమెరాల పర్యవేక్షణలో.. ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు

ap inter board logo

ఏపీ ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వీడియో కెమెరాల పర్యవేక్షణలో శనివారం ప్రారంభం కానున్నాయి. మొత్తం 905 సెంటర్లలో 3,37,054 మంది జనరల్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2,46,653మంది ఎంపీసీ, 90,401బైపీసీ గ్రూపు విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఒకేషనల్‌ విద్యార్థులు 66,611 మంది పరీక్షలు రాస్తారు.

ఈనెల 20 వరకు రోజూ ఉదయం 9- 12గంటల వరకు, సాయంత్రం 2-5 గంటల వరకు.. రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల్లో జంబ్లింగ్‌ పద్దతి అమలు చేస్తున్నారు. అన్ని సెంటర్లలో వీడియో కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుంది. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తికి చేసుకునేందుకు ఇంటర్‌ బోర్డులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

Related posts