telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

AP లో వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

అఖండ మెజారిటీ తో విజయం సాధించిన NDA కూటమి గత ప్రభుత్వం లో నియమించబడిన వాలంటీర్ల విషయంలో ఎలా ముందుకెళుతుందని దానిపై ఆసక్తి నెలకొంది.

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎలెక్షన్స్ విధుల్లో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ఆ తర్వాత వాలంటీర్లకు చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు.

ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల కు రూ.10 వేల జీతం ఇస్తామని కూటమి నేతలు ప్రచారం చేశారు.

వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

రాజీనామా చేసిన వారు 2లక్షల మంది వాలంటీర్ల ను ఏ విధంగా ఉపయోగిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది.

వాలంటీర్ల సంఖ్యను తగిస్తారా? మరియు కొత్తగా నియమిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Related posts