telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రత్యర్థులపై కక్ష సాధించడం ఫ్యాక్షనిస్టుల స్వభావం: చంద్రబాబు

chandrababu

టీడీపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుమండిపడ్డారు. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఒక అవినీతిపరుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అవన్నీ జరుగుతున్నాయి. ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ జగన్ చేస్తున్నది ఇదే’అని దుయ్యబట్టారు.

నిన్న బీసీ నేత అచ్చెన్నాయుడు ఇంటి గోడలుదూకి మరీ వెళ్ళిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసారు. ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిపాలనలో ఘోరంగా విఫలమై ప్రజల దృష్టిని మరల్చడానికి పాలకులు చేస్తున్న అరాచకాలను అందరూ అడ్డుకోవాలి. లేదంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని చంద్రబాబు అన్నారు.

Related posts