telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

హ్యూమన్ ట్రాఫికింగ్ అత్యంత నేరం… యంగిస్తాన్ ఫౌండేషన్ – వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం 2023

-దీని పైన అవగాహన పెరగాల్సిన అవసరముంది…
-రక్షణ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేయాలి…
-చట్ట పరమైన చర్యలను విసృతం చేయాలి..
-యాంటీ ట్రాఫికింగ్ కార్యక్రమంలో నినదించిన న్యాయ నిర్వహణ అధికారులు…
-యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహాణ..

మనుషుల అక్రమ రవాణకు వ్యతిరేఖంగా ఈ ఏడాది ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వ్యతిరేఖ దినోత్సవాన్ని’ నిర్వహించడానికి స్వచ్చంధ సేవా సంస్థలు, ప్రభుత్వ-చట్టపరమైన సంస్థలు, పౌర సమాజ సంస్థలు పరస్పరం భాగస్వాములయ్యాయి. అంతేకాకుండా ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌’ను నియంత్రించడం, బాధితులను గుర్తించడం, ట్రాఫికర్లపై ఉక్కుపాదం మోపడం తప్పనిసరని నినదించాయి. ఈ ఏడాది ‘రీచ్‌ ఎవ్రీ విక్టిమ్‌ ఆఫ్‌ ట్రాఫికింగ్‌, లీవ్‌ నో వన్‌ బిహిండ్‌’ అనే ప్రచార థీమ్‌గా ఎంపిక చేశారు. ఈ నినాదం 2030 సంవత్సరానికి కేంద్ర వాగ్దానాలైనటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీలు) నుంచి ప్రేరణగా తీనుకున్నారు.

ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని., నగరంలోని యంగిస్తాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో న్యాయ నిర్వాహాణ అధికారులు, ట్రాఫికింగ్‌ నుంచి బయటపడిన వ్యక్తులు, కళాకారులతో పాటు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (టీఎస్‌సీపీసీఆర్‌), టీ-హాబ్‌ తదితరులతో కలిసి సామాజిక అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులతో భాగంగా హ్యూమన్ ట్రాఫికింగ్, కార్మికుల కోసం అక్రమ రవాణా, కార్మికులను అక్రమంగా బంధించడం, బలవంతపెట్టడం, దోపిడీ, హింసించడం, జీవితాన్ని దుర్భరమైన పరిస్థితులకు చేరువ చేయడం అత్యంత ఘోరమైన నేరమని తెలియజేశారు.

ఈ సందర్భంగా హాజరైన Anish Anthony, Chief Delivery Officer, T-Hub,
Srinivasa Rao, Chairperson, TSCPCR పలు పోస్టర్‌లను విడుదల చేశారు. “మానవ అక్రమ రవాణా (హ్యూమన్‌ ట్రాఫికింగ్‌)ను ఎదుర్కోవడానికి విద్య, అవగాహాన చాలా కీలకమైనది. ట్రాఫికర్ల వ్యూహాలు, జాగ్రత్త వహించాల్సిన హెచ్చరికలు తదితర సమాచారాన్ని సామాజికంగా వ్యక్తులకు, సంఘాలకు తెలియజేయాలి. సామాజికంగా విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారు అప్రమత్తంగా ఉండటంతో పాటు ట్రాఫికింగ్‌పై అనుమానాస్పద కార్యకలాపాలను అధికారులకు వెంటనే వెల్లడించేలా వారికి అవగాహానను కల్పిస్తామని’’ అని
వారు తమ ఆలోచనలను వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యంగిస్తాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరుణ్ డేనియల్ ఎల్లమటి మాట్లాడుతూ.., “ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంలో, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో సంబధింత శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేరస్తులను తరచుగా శిక్ష నుండి రక్షించే శిక్షార్హత విధానాలను నిలువరించేలా ప్రభుత్వాలుప్రత్యేక శ్రద్ద చూపాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ., ట్రాఫికింగ్‌ కోరల నుంచి బయటపడిన బాధితులు తాము ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను, అనంతరం వారికి అవసరమైన పునరావాస అంశాల గురించి వివరించారు. సామాజికంగా వారు కోరుకునే పురోగతిని, సేవలను ప్రేక్షకులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహాన కల్పించడం కోసం వినూత్నంగా ప్రయత్నంగా ఆర్ట్ ఎగ్జిబిషన్, CAPRICIO మ్యూజిక్ బ్యాండ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రదర్శనను నిర్వహించారు.

టీఎస్‌సీపీసీఆర్‌ ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.., “తమ ఆధ్వర్యంలో 0-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అందించడంలో సహాయం చేస్తామని తెలిపారు. భారతదేశంలో గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల మంది మహిళలు, చిన్నారులు తప్పిపోయారు. ఈ సమస్య ఎక్కువగా బలహీన వర్గాల మూలాల్లో కొనసాగుతుంది. ఇది పేదరికంలో ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరంగా మారింది. అక్రమంగా తరలించిన ఈ మహిళలను బలవంతంగా లైంగిక కార్యకలాపాలకు ఇతర అసాంఘీక కార్యకలాపాల్లో చేర్చబడుతున్నారని పేర్కొన్నారు. దీన్ని నియంత్రించడం మన వల్లే సాధ్యమవుతుంది. సామాజిక భాధ్యతగా చేపట్టే మన చర్యలు, మన సామాజిక సేవ ఈ సమస్య గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఈ అవగాహాన ప్రతి ఒక్కరినీ అక్రమ రవాణా నుంచి కాపాడుతుందని అన్నారు.

అనీష్‌ ఆంథోని మాట్లాడుతూ., ప్రస్తుతం మనందరి దైనందిన జీవితంలో సోషల్ మీడియా భయంకరమైన వ్యసనంలా మారిందని అన్నారు. ఈ సందర్భంగా సురక్షితంగా ఉండటానికి సోషల్ మీడియాలో ఏమి పోస్ట్ చేస్తున్నారో గమనించుకోవాలని హెచ్చరించారు. ఏదైనా పొరపాటు జరిగిన సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులను సంప్రదించడానికి సంకోచించవద్దని సూచించారు. దేశవ్యాప్తంగా దాదాపు 900 మిలియన్ల మంది సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. మనమంతా ఆన్‌లైన్‌లో ఈ ట్రాఫికింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే, టెక్నాలజీతో సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని అనీష్‌ ఆంథోని పేర్కొన్నారు

Related posts