తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరాలని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొన్.రాధాకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పుదుకోటలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రజనీకాంత్ పార్టీని ప్రారంభిస్తే తాను మనసారా స్వాగతిస్తానని, అయితే పార్టీని ప్రారంభించడం కంటే ఆయన బీజేపీలో చేరితే చాలా మంచిదని తాను భావిస్తున్నానని రాధాకృష్ణన్ తెలిపారు.
డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం నుండి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి డాక్టర్ పట్టాను స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. నాంగునేరి, విక్రవాండి నియోజకవర్గంలో బీజేపీ కూటమి మిత్రపక్షమైన అన్నాడీఎంకే అభ్యర్థులే గెలుస్తారని రాధాకృష్ణన్ జోస్యం చెప్పారు.