ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 16లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 72,979 శాంపిల్స్ పరీక్షించగా 15,284 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 106 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 20,917 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,09,105 కి చేరగా.. యాక్టివ్ కేసులు 1,98,023 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 14,00,754 కరోనా నుంచి కోలుకోగా 10,328 మంది ప్రాణాలు కోల్పోయారు.
previous post