telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

త్వరలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా..?

తనదైన నటనతో లక్షల మందిని తనకు అభిమానులగా మార్చుకున్నాడు ఎన్‌టీఆర్ . అదేవిధంగా దర్శకులలో త్రివిక్రమ్ కూడా తన మాటల మంత్రాలతో ప్రేక్షకులను ముగ్దులను చేసి తన అభిమానులుగా చేసుకున్నాడు. ఎన్‌టీర్ కొత్త సినిమా అంటే ఉంటే క్రేజ్ అంతఇంత కాదు. అంతే త్రివిక్రమ్ సినిమాకు కూడా భారీ రేంజ్ క్రేట్ ఉంటుంది. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అభిమాలనులకు ఎక్కడలేని ఉత్సుకత ఉంటుంది. అరవింద సమేతా సినిమాతో వీరి కాంబో పవర్ ఎంటో చూపించారు. అటువంటిది మళ్లీ వీరు జతకట్టనున్నారు. దాంతో ఈ సారి ఏ రేంజ్‌లో వీరి సినిమా ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించింది లేటెస్ట్ అప్‌డేట్ కోసం కూడా వారు వెయిట్ చేస్తున్నారు. అయితే వీరి కాంబోలో రానున్న సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందట. ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్‌లతో పాటు ఎన్‌టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్‌టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టనున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఇందులో ఎన్‌టీఆర్‌తో పాటు పలు భాషల స్టార్ హీరోలు కూడా చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఎన్‌టీఆర్, త్రివిక్రమ్‌లు న్యూఇయర్ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. త్వరలో చిత్రీకరణ మొదలు పెడగామని తెలిపారు. దాంతో వీరి కాంబో తెలుగు సినీ పరిశ్రమ చేత ఔరా అనిపించే వసూళ్లు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Related posts