telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మేక సూరి” మోషన్ పోస్టర్ విడుదల

Mekasuri

అభినయ్, సుమయ హీరోహీరోయిన్లుగా త్రినాధ్ వెలిశిల రూపొందించిన చిత్రం ‘మేక సూరి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను తాజాగా జీ5 సంస్థ విడుదల చేసింది. అంతా కొత్తవారితో రూపొందిన ఈ చిత్రాన్ని జీ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పెద్ద సంస్థ కొనుగోలు చేయడంతో ఇప్పుడు సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 1725 స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా జీ 5 సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మేక సూరి’ చిత్ర మోషన్ పోస్టర్‌ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం జరిగింది. మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. పూర్తిగా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. త్రినాధ్ వెలిశిల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారు. త్వరలో టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నాము. ఈ సినిమా జీ5 యాప్ ద్వారా ఈ నెల 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కథని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయి. హీరోగా అభినయ్, హీరోయిన్‌గా సుమయ నటించిన ఈ చిత్రానికి ప్రజ్వల్ క్రిష్ మ్యూజిక్‌ని అందించారు. గతంలో పలు సినిమాలను చిత్రీకరించిన పార్ధు సైనా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తప్పకుండా ఈ చిత్రం జీ5 అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నాము..’’ అని తెలిపారు. ఇక ఈ చిత్ర టీజర్‌ త్వరలో స్టార్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ లేదా వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల కానుందని తెలుస్తుంది.

Related posts