telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నయనతార పెళ్ళికి బ్రేకులు ?

nayanatara movie ira grand release

లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరుగుతుంటే వారికున్న డిమాండ్ తగ్గుతుంటుంది. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార క్రేజ్ మాత్రం వయసుతోపాటే పెరుగుతోంది. కాగా… నయన్ ఎప్పట్నుంచో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమయాణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వీరు పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే నయనతార ఇమేజే వీరి పెళ్లికి బ్రేకులు వేస్తోందట. ప్రస్తుతం నయనతార తెలుగు, తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో, కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో నయనతారకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయేమోనని నయన్ భయపడుతోందట. అందువల్లే పెళ్లిని మరో సంవత్సరం వాయిదా వేయాలని విఘ్నేష్‌కు నచ్చచెబుతోందట. ఈ ఏడాది చివర్లో నయన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా వార్తల నేపథ్యంలో నయన్ పెళ్లి ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది.

Related posts