telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇక పశువులకు కూడా ఆధార్… ఏపీలో వినూత్న ప్రయత్నం… !

Cow

ఆంధ్రప్రదేశ్ లో పశుసంవర్ధక శాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. రాష్ట్రంలోని పశువులకు ఆధార్ ను కల్పించేందుకు సిద్ధం అయ్యింది. కేంద్రం సహాయంతో ఈ ఆధార్ గుర్తింపు ఇవ్వబోతున్నది. పశువులకు ఆధార్ ఈ ట్యాగ్ ను వేస్తున్నారు. ఈ ట్యాగ్ వేయడం ద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా పశువుల వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్యాగ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ జరుపుకోవచ్చు. ట్యాగ్ కు ఉన్న కోడ్ ను ఆధారంగా పశువు గురించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ కోడ్ లను ఈనాఫ్ యాప్ కు అనుసంధానం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా పశువులకు ఎద ఇంజక్షన్లు ఎప్పుడు ఇవ్వాలి, చూలు నిర్ధారణ, ఎప్పుడు దూడను ఈనుతుంది, ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి, ఎంతకాలం ఇస్తాయి, ఏఏ జబ్బు లు ఉన్నాయి, ఏమి మందులు వాడాలి అనే అంశాలను ఇందులో నమోదు చేస్తారు. వీటి ద్వారా ఈ విషయాలు తెలుసుకోవచ్చు. పశువుల అపహరణ జరిగినా ఈ ట్యాగ్ ద్వారా అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను పైగా తెలుసుకోవచ్చు. ఎన్నో బహుళ ప్రయోజనాలు ఉండటంతో దీనిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.

Related posts