టీడీపీ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఆదివారం విశాఖ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని జన్మలెత్తినా విశాఖ ప్రజల రుణం తీర్చుకోలేనని గంటా అన్నారు. ఎన్నికలకు 21 రోజుల ముందు ఉత్తర నియోజకవర్గం సీటు ఖరారైందన్నారు.
తనను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న జగన్ పిలుపు ప్రజలను ఆకట్టుకుందన్నారు. ఈనెల 29వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఓటమిపై లోతుగా చర్చిస్తామని చెప్పారు.
చంద్రబాబుకు పవన్ పార్ట్నర్: వైఎస్ జగన్