telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి…

ఈరోజు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయన బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్టు తన అనుచరులకు కొండా ఫోన్ చేసిన సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలని ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నానని కొండా చెప్పినట్టు సమాచారం. నిజానికి మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డితో బీజేపీ ఎప్పటి నుండో టచ్‌ లో ఉంది. GHMC ఎన్నికల ఇంఛార్జ్‌గా వచ్చిన భూపేందర్ యాదవ్ ఆయనతో సమావేశం అయ్యారు. అప్పట్లో ఈ పరిణామం కాంగ్రెస్‌ వర్గాల్లోనూ కలవరం రేపింది. విశ్వేశ్వర్‌రెడ్డి ఉద్యమ సయయంలో టీఆర్‌ఎస్‌లో చేరి తర్వాత చేవెళ్ల నుంచి ఎంపీ అయ్యారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో ఓ నేతతో వచ్చిన చిన్న గ్యాప్‌ కారణంగా అధికార పార్టీకి గుడ్‌బై చెప్పేశారాయన. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు విశ్వేశ్వర్‌రెడ్డి. అయితే చూడాలి మరి ఆయన బీజేపీ తీర్ధం ఎప్పుడు పుచ్చుకుంటారు అనేది.

Related posts