telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

“ఆయుష్మాన్ భవ”ను తెలంగాణలో అమలు చేయడం: ఎంపీ ధర్మపురి అరవింద్

aravind bjp mp

కేంద్ర ప్రథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.ఈ విషయమై నిన్న అమిత్ షా పర్యటనలో స్పష్టమైన సంకేతాలిచ్చారని తెలిపారు. కామారెడ్డిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఆయన విరుచుకుపడ్డారు. కుటుంబపాలనకు స్వస్తి పలకాలని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పథకం “ఆయుష్మాన్ భవ”ను తెలంగాణలో అమలు చేయడం లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల ఇబ్బందుల తీర్చే రోజు దగ్గరకు వచ్చిందన్నారు. ఆ సమస్యను పరిష్కరించిన రోజున సీఎం కేసీఆర్ తమ నెత్తిపై గుడ్డ వేసుకుని కూర్చోవాల్సి వస్తుందంటూ దుయ్యబట్టారు. ఆవాస్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు ఇచ్చిన నిధులను కమిషన్ ల కొరకు ప్రాజెక్టులనిర్మాణాలకు ఈ ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు.

Related posts