telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కొత్త రికార్డు సాధించిన భీమ్ టీజర్…

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమా కోసం సినీ ప్రేమికులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి జక్కన సినిమా తెరకెక్కించడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్ ఫర్ రామరాజు , రామరాజు ఫర్  భీమ్ పేర్లతో రెండు టీజర్లను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ రెండు టీజర్లు సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. అయితే లాక్ డౌన్ లో విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇటీవలే తెలుగులో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్ వంతు వచ్చేసింది. గత నెలలో విడుదలైన రామరాజు ఫర్ భీమ్ ఎన్టీఆర్ టీజర్ కు అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు అతి తక్కువ టైం లో ఇన్ని లైకులు వచ్చిన టీజర్ ఇదే. ఇక దీనితో పాటు ఎన్టీఆర్ టీజర్ లక్ష కామెంట్లను పొందింది.ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా టీజర్ కూడా లక్ష కామెంట్స్ ను పొందలేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే హీరోలు ఇద్దరు షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్.. ఆలియా భట్ లతో పాటు హాలీవుడ్ నటులు కనిపించనున్నారు.

Related posts