తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాశెట్టి లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రధాని మోడీపై కరీంనగర్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్, కనీసం బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. కరీంనగర్ సభలో బీజేపీపై, పార్టీ నాయకులపై మాట్లాడిన తీరు సరిగ్గా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పుకునే కేసీఆర్.. పార్టీ ఫిరాయింపులపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కు పరిమితమైన మీరు దేశ రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.
previous post