telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్

jc prabhakar reddy

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాదు శివారు శంషాబాద్‌లో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు.

నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Related posts