telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పబ్ జీ గేమ్ మరో యువకుడి ప్రాణాలు బలి…

మరో యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది పబ్ జీ గేమ్. ఈ ఆట ఆడుతూ ఆవేశానికి లోనై..గుండెపోటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.  కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. పిల్లలు, యువతకు ఇంటర్నెట్ వ్యసనంగా మారుతున్నది. స్మార్ట్ ఫోన్ లు చేతిలోకొచ్చిన తర్వాత.. వారు ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడి.. దానికి ఎడిక్ట్ అవుతున్నారు.    తిండి, నిద్ర  మరిచి.. గంటలపాటు ఆ ఆటల్లోనే మునిగిపోతున్నారు.  చివరికి ఇదే వ్యసనంతో…ప్రాణాలు పోగొట్టుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడు పబ్ జీ గేమ్ ఆడుతూ హార్ట్ ఎటాక్ తో చనిపోవడం సంచలనం రేపుతోంది. పబ్ జీ గేమ్ ఆడుతుండగా గుండెనొప్పితో సాయికృష్ణ అనే యువకుడు మృతి చెందాడు.

ఉదయం నుంచి పబ్ జీ గేమ్ ఆడుతున్న సాయికృష్ణ… ఆట ఆడుతూ.. ఆవేశానికి లోనయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలో గుండెపోటుతో మృతి చెందాడు.  తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ ఇంట్లో ఉంటున్నాడు సాయికృష్ణ. అతని వయసు 22 ఏళ్లు. ఆన్ లైన్ గేమ్ కు బానిసై… ఆ ఆటకే బలవడంతో సాయికృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదంతో ఇటీవల ప‌బ్‌జీ మొబైల్ గేమ్ భార‌త్‌లో పూర్తిగా నిషేధ‌మైంది.  అయినప్పటికీ డెస్క్ టాప్ వర్షన్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పిల్లలు, యువత ఈ గేమ్ ను ఆడుతూనే ఉన్నారు. ఇక ప‌బ్‌జి కార్ప్ సంస్థ ప‌బ్‌జి గేమ్‌ను ఇండియ‌న్ వెర్ష‌న్ రూపంలో లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొత్తంమీద ఆన్ లైన్ గేమ్స్  పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ హాని చేస్తోంది. ఆరోగ్య సమస్యలే కాదు ప్రాణాలనూ హరిస్తోంది. దీనిపై ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Related posts