telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీలో మేకప్ ఛాలెంజ్… వీడియో వైరల్

లాక్ డౌన్‌ ప్రభావంతో సినిమా తారలంతా ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఓవైపు సినిమా హీరోలంతా రియల్ మేన్ ఛాలెంజ్ చేస్తుంటే మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ సరికొత్త ఛాలెంజ్ ప్రారంభించారు. మెగా లేడీస్ మేకప్ ఛాలెంజ్ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఇందులో చిరంజీవి ఇద్దరు కూతుర్లు, సుస్మిత, శ్రీజ ఉన్నారు. వీరితో పాటు నాగబాబు కూతురు నిహారిక,అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా కనిపించారు. మేకప్ వేసుకొని కనిపించాలంటూ ఓ ఛాలెంజ్ విసిరారు. వీరి వీడియోకు బాలీవుడ్ ఫేమస్ సాంగ్ ‘ మేర సూట్ పటియాలా కితనోంకొ మార్ డాలా’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడారు. ఈ పాటకు మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ అంతా స్టెప్పులు కూడా వేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెెగ వైరల్ అవుతోంది.

Related posts